హైదరాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్‌లను కొనసాగిస్తామని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి స్పష్టం చేశారు. తెలంగాణ ఆడ బిడ్డల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంగళవారం ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఈ రెండు స్కీమ్‌లపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఈ స్టేని తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుందన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న సుమారు 1,80,000 మందికి సాయం రిలీజ్ చేస్తామని తెలిపారు.
